మన నేల!
- Puneeth Kumar Gubba
- Jan 20, 2022
- 1 min read
Updated: Jan 21, 2022

ఇదే మన నేల రా! ఇదే నీ జన్మభూమి రా! నీ తల్లికి జన్మనిచ్చిన మహా పుణ్యతీర్థం నీ చావు దాకా నిన్ను మోసే మహాతల్లి
ఒక్క నదితో నిండిన సంద్రం కాదు ఇది ఎన్నో నదుల జలాలతో నిండిన మహాసముద్రం ఇది
ఏ మతమైనా, ఏ కులమైన మరిగే రక్తం ఒక్కటే ఏ ఆచారమైన, ఏ భాషైన మనస్సులో ఉన్న ప్రేమ ఒక్కటే
దేశాన్ని ప్రేమించడం అంటే ప్రభుత్వాన్నో, మట్టినో కాదు రా దేశాన్ని ప్రేమించడం అంటే దేశం కోసం జీవించటం రా
త్యాగమూర్తుల జ్ఞాపకార్థం ఈ దేశం అమర వీరుల కష్టఫలం ఈ దేశం
ఇదే రా మన దేశం ఇదే రా మన కళల ప్రపంచం దేశ భక్తి ని చాటుదాం! దేశాన్ని తీర్చిదిద్దుదాం!
Comments